UseTelugu.com – తెలుగు వాడండి

కమ్మని కాఫీ లాంటి తెలుగు .. మనసార ఆస్వాదించండి

Motivation (ప్రేరణ)

USE TELUGU

ఆలోచించి ఐశ్వర్యాన్ని పెంచుకో

నెపోలియన్ హిల్ (1883-1970)

    1937

ఉపోద్ఘాతము

ఈ బుక్ లోని ప్రతి చాప్టర్ లో, డబ్బు సంపాదించే ఒక గొప్ప రహస్యాన్ని చెప్పడం జరిగింది. ఈ రహస్యాన్ని ఉపయోగించి ఐదు వందల మంది అత్యంత ధనవంతులు ఎలా తమ భాగ్యాన్ని పొందారో నేను చాలా సంవత్సరాలు చాలా దగ్గరగా పరిశోధించి కనుక్కున్న విషయాల్ని ఈ బుక్ లో పొందు పరిచాను.

ఈ గొప్ప రహస్యాన్ని ఒక పావు శతాబ్దం ముందు నాకు ఆండ్రూ కార్నెగీ (Andrew Carnegie) అనే ఒక గొప్ప అమెరికన్ వ్యాపారవేత్త అందజేసారు. తెలివైన, స్నేహపూర్వకమైన ఆండ్రూ కార్నెగీ నేను ఇంకా చిన్నబ్బాయిగా ఉన్నప్పుడే ఈ రహస్యాన్ని నా చిన్ని మెదడు లోకి అలవోకగా విసిరెసాడు. అలా చేసి కుర్చీలో విశ్రాంతంగా కూర్చొని, ఏదో తెలియని ఉల్లాసభరిత కనుచూపుతో, నన్ను జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించసాగాడు. బహుశ నా చిన్ని వయసు మరియు మెదడు అతడు అందచేసిన ఆ రహస్యాన్ని మరియు దాని ప్రాముఖ్యాన్ని గ్రహించిదో లేదో అనే అనుమానం కావొచ్చు.

ఎప్పుడైతే అతను నేను ఈ రహస్యాన్ని గుర్తించానని గమనించాడో,  ఒక ప్రశ్న అడిగాడు. “ఇరవై సంవత్సరాలు కాని అంతకంటే ఎక్కువ కాని నీవు నీ జీవితాన్ని ఈ రహస్యాన్నిపూర్తి గా అర్థం చేసుకొని, ఈ ప్రపంచం లో ఉన్న ఆడ , మగ అని తేడా లేకుండా, ఎవరైతే ఈ రహస్యం తెలీక పోతే తమ జీవితం లో విజయం సాధించ లేరో , వారికి అందజేయ గలవా ?”. ఆ ప్రశ్న కి నేను మరో మారు ఆలోచించకుండా సరేనని ఒప్పుకొని , ఆండ్రూ కార్నెగీ గారి సహకారంతో నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను.

ఈ బుక్ లో నిక్షిప్తం అయిన ఆ రహస్యం, వేల మంది ప్రజలు తమ తమ జీవితాల్లో ఆచరణ లో పెట్టి, అది ఎలా పనిచేస్తుందో పరీక్షించి చూశారు. ఆండ్రూ కార్నెగీ గారి అభిప్రాయం ప్రకారం ఈ “మాజిక్ ఫార్ములా” , ఏదైతే తనకు అంత గొప్ప ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టిందో , ప్రజలందరికి అందు బాటులో ఉండాలని ఆకాంక్షించారు. అలా చేయడంవల్ల డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకునే సమయం లేని వారందరికీ , ఈ ఫార్ములా పరీక్షించే అవకాశం రావడం వల్ల , నాకు వారి విజయాలను  దగ్గర నుండి వీక్షించే అవకాశం వస్తుందని, అలా ఈ రహస్యాన్ని , దాని గొప్పదనాన్ని, వారి అనుభవాలను క్రోడీకరించే  పని సులువవుతుందని  వారి ఉద్దేశ్యము.

ఈ ఫార్ములా ను పబ్లిక్ స్కూల్స్ లోనూ మరియు కాలేజీలలో బోధించాలని, అంతే కాకుండా అతని అభిప్రాయం ప్రకారం ఒకవేళ ఈ ఫార్ములాను సరిగ్గా బోధించడం కనుక జరిగితే అది మన విద్యా వ్యవస్థలో ఒక గొప్ప విప్లవాన్ని తీసుకువచ్చి విద్యాలయాల్లో విద్యార్థులు గడిపే సమయాన్ని సగంకంటే తక్కువకు కుదించవచ్చని, ఆండ్రూ కార్నెగీ గట్టిగా నమ్మేవాడు.

చార్లెస్ మ్. శ్వాబ్ మరియు అట్లాంటి ఇతర యువకులతో కార్నెగీ గారికి ఉన్న అనుబంధం మరియు వ్యాపార సంబంధాల అనుభవం వలన, స్కూల్లలో నేర్చుకునే దేదీను ఐశ్వర్య సాధనలో పనికిరాదని గట్టిగా నమ్మేవాడు.ఒకరి తరువాత ఒకరిని యువకులను తన వ్యాపారం లోకి ఆహ్వానించి వారికి ఈ ఫార్ములా ను నేర్పించి, వారికి ఎక్కువ విద్య లేకపోయినా వారందరినీ గొప్ప నాయకులుగా మార్చిన తరువాత, కార్నెగీ గారు ఈ అభిప్రాయానికి వచ్చారు.అంతేకాకుండా, అతని బోధనల ప్రభావం వలన ఎవరేవరైతే అతని సూచనలను పాఠించారో వారు ఎనలేని భాగ్యాన్ని సంపాదించారు. ఈ బుక్ లోని “విశ్వాసం” (Faith) అనే అధ్యాయం లో, మీరు భారీ “యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్” సంస్థ ఏర్పాటు జరిగేందుకు కారణమైన ఒక దిగ్బ్రమ చెందించే ఓక వృత్తాంతం ను మరియు, ఆ గొప్ప ఆలోచన ఎలా రూపుదాల్చిందో మరియు అంతటి గొప్ప ఆలోచనను ఎలా కొంతమంది యువకులు కార్యాచరణలో పెట్టారో , తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది,కార్నెగీ గారి  ఈ ఫార్ములా ఎంతటి గొప్ప ఫలితాలను ఇస్తుందో. ఈ రహస్య ఫార్ములాను చార్లెస్ మ్. శ్వాబ్ ఈ భారి సంస్థ ఏర్పాటులో వాడుకొని ఎంతో భాగ్యాన్ని, డబ్బు మరియు గొప్ప “అవకాశాన్ని” అందుకున్నాడో చూస్తారు. టూకీగా చెప్పాలంటే, ఈ సంస్థ ఏర్పాటులో ఈ రహస్యం యొక్క విలువ ” ఆరు వందల మిలియన్ డాలర్స్”.  అలా చెప్పాలంటే, ఈ వాస్తవాలు మరియు కార్నెగీ గారి గురించి  తెలిసిన వారు నమ్మే వాస్తవాలు మీరు తెలుసుకుంటే మీకు చక్కని అభిప్రాయం వచ్చేస్తుంది, భాగ్యాన్ని ఎలా పొందాలో, కాని ఒక్క షరతు తో, “నీకు ఏమి కావాలో అది మొదలు తెలుసుకో”!

ఇరవై సంవత్సరాల కఠిన పరీక్షలో ఈ రహస్యం మునిగి తేలక ముందే, ఆండ్రూ కార్నెగీ గారి ప్రణాళిక ప్రకారం ఇది ఒక లక్ష మంది స్త్రీ , పురుషుల కు వారి వ్యక్తిగత లాభాలను పొందడానికి అందజేయడం జరిగింది. అందులో కొంత మంది కార్నెగీ గారు ఊహించినట్లుగానే ఐశ్వర్యవంతులయ్యారు. మరి కొంతమంది ఈ రహస్యాన్ని వాడి వారి గృహం లో స్వర్గాన్ని సాధించారు. ఒక మతాచార్యుడైతే ఈ రహస్యాన్ని ఎంత అమోఘంగా వాడాడంటే ఏకంగా ఒక సంవత్సరంలో  $75000.00 డాలర్ల కంటే ఎక్కువే సంపాదించాడు.

అమెరికాలోని  సిన్సిన్నాటి అనే నగరం లో ఉండే ఆర్థర్ నాష్ అనబడు ఒక దర్జీ ఈ ఫార్ములా ను పరీక్షించడానికి, దగ్గరలో దివాళా తీస్తున్నటువంటి తన వ్యాపారాన్ని పరీక్షించడానికి వాడాడు. అదే వ్యాపారం తరువాత కొత్త జీవితం తో భాసిల్లింది మరియు తన యజమానులకు ఎంతో లాభాలను తెచ్చిపెట్టింది. ఆర్థర్ నాష్ ఇప్పుడు లేనప్పటికీ ఆ వ్యాపారం ఇప్పటికీ లాభాలతో నడుస్తోంది. ఆ ప్రయోగం అప్పట్లో ఎంతో ప్రచారం పొందినది. అంతే కాకుండా చాలా వార్తా పత్రికలూ మరియు సచిత్ర పత్రికలు మిల్లియన్ డాలర్ల ఉచిత ప్రచారం చేసాయి.

ఇదే రహస్యాన్ని డల్లాస్ లోని టెక్సాస్ నగరం లో నివసించే స్టువర్ట్ ఆస్టిన్ విఎర్ అనే అతనికి అందజేయడం జరిగింది. అతను ఈ ఫార్ములాను ప్రయోగించడానికి ఎంతో ఉత్సాహంగా మరియు సిద్దంగా ఉన్నాడు. ఎంత సిద్దంగా ఉన్నాడంటే తన ప్రస్తుత వృత్తిని వదిలి న్యాయవాద విద్యను అభ్యసించేందుకు సిద్ధమయ్యాడు. మరి ఆటను ఆ ప్రయోగంలో సఫలీకృతుడయ్యాడా ? ఆ వృత్తాంతము కూడా ఈ బుక్ లో వివరించడం జరిగింది.

ఈ రహస్యాన్ని నేను జెన్నింగ్స్ రాండోల్ఫ్, అనబడునతనికి అతను కళాశాలో పట్టభద్రుడు కాగానే చెప్పడం జరిగింది.  దాని ప్రభావం ఎంత గొప్పదంటే ఆతను ఇప్పుడు మూడవ మారు మెంబర్ అఫ్ కాంగ్రెస్ గా విజయవంతంగా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా నా నమ్మకం ఏమిటంటే అతను అలాగే ఈ రహస్యాన్ని వాడుకొని వైట్ హౌస్ లోకి కూడా అడుగుపెడతాడు.

నేను లా-సాల్ దూర విద్య విశ్వవిద్యాలయం లో అడ్వర్టైజింగ్ మేనేజర్ గా పని చేసే రోజుల్లో నాకు అధ్యక్షుడు జె. జి. చాప్లిన్ గారితో పనిచేసే గొప్ప అవకాశం కలిగింది. వారు ఈ ఫార్ములాను  ఈ విశ్వవిద్యాలయాన్ని ఒక గొప్ప సంస్థ గా తీర్చి దిద్దడానికి ఉపయోగించిన విధానం దగ్గరగా చూసే అదృష్టం నాకు దొరికింది.

ఏదైతే నేను రహస్యమని మీకు ఇప్పటివరకు సూచించుచున్నానో అది ఈ పుస్తకం లో వంద కంటే ఎక్కువసార్లే ఉదహరించడం జరిగింది. అయితే ఈ రహస్యానికి స్పష్టమైన పేరు చెప్పడం జరగదు. ఎందుకంటే చాలా మార్లు ఆ రహస్యాన్ని మీ ముందర తెరిచి ఉంచి నట్లైతే పేరు ఏదీ చెప్పకుండానే అది విజయవంతంగా గ్రహించిన వారే ఎక్కువ. అయితే ఈ రహస్యం “ఎవరైతే వెతుకుతున్నారో , ఎవరైతే సంసిద్ధం గా ఉన్నారో” వారికి అలవోకగా అందుతుంది, అర్థమవుతుంది. అందుకొరకే కార్నెగీ గారు నాకు ఎంతో నిశబ్దంగా ఈ రహస్యాన్ని, ఈ పేరు చెప్పకుండా అందించారు.

నువ్వుగనుక ఈ ఫార్ములా ను ఉపయోగించడానికి సిద్దముగా ఉన్నట్లయితే, ఈ రహస్యాన్ని ప్రతి అధ్యాయం లో ఒక్కసారైనా నువ్వు గుర్తిస్తావు. నీవు ఈ ఫార్ములా ను మరియు ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి సిద్దంగా ఉన్నావో లేవోనని తెలియచెప్పాలని నా మనస్సు ఎంతో కోరుకుంటోంది , కాని అలా చేస్తే నేను నీ స్వశక్తి తో ఆ రహస్యాన్ని నీవే తెలుసుకునే ఒక గొప్ప అవకాశాన్ని నీ నుండి నేను దూరం చేసినవాన్నవుతాను. అందువలన ఆ రహస్యం కనుక్కునే ప్రయత్నం లో జరిగే లాభాన్ని నీవు పూర్తిగా పొందాలంటే నేను ఈ రహస్యాన్ని నీకు యధావిధిగా చెప్పకుండా నీ అంతట నీవు కనుక్కునే టట్లు ప్రయత్నిస్తాను.

ఈ బుక్ వ్రాయబడుతున్న సమయంలో, తన కాలేజీ చదువులో ఆఖరి సంవత్సరం లో ఉన్న నా కుమారుడు , ఈ బుక్ లోని రెండవ అధ్యాయము ప్రతిని చదివి , ఈ రహస్యాన్ని తనంతట తాను కనుక్కున్నాడు. అతను ఆ సమాచారాన్ని ఎంతో సఫలంగా వాడుకొని చాలా మంది జీవితాల్లో గొప్ప ఉద్యోగాల్లో ఉంది కూడా సంపాదించ లేనంత డబ్బు తన మొదటి గౌరవమైన గొప్ప ఉద్యోగం లో  చేరి సంపాదించాడు. అతని గురించి రెండవ అధ్యాయం లో క్లుప్తంగా వివరించడం జరిగింది.

మీరు ఈ బుక్ చదువుతున్నప్పుడు, ఒకవేళ మొదట్లో ఇందులో చాలా గొప్ప రహస్యం ఉన్నదన్న నిజం ఒక అతిశయోక్తి అని అనుకొని ఉన్నప్పటికీ, అది క్రమేపీ తగ్గి ఒక రకమైన ఆనందకరమైన  నిజాన్వేషణ విజయాన్ని అనుభూతి చెందుతారని నా గట్టి నమ్మకం. అంతే కాకుండా, నీ జీవితంలో ఎప్పుడైనా అధైర్యపడి ఉన్నట్లయితే కాని , ఏదైనా కష్టం మిమ్మల్ని క్రుంగి కృశించజేసినప్పుడుకాని, ఏదైనా సాధించాలనుకొని ఓడిపోయినప్పుడు కాని, ఏదైనా జబ్బుతో కాని శారీరక అంగవైకల్యం తో నిరాశాచెందినప్పుడు కాని  , ఈ జీవితం తో విసిగిచెందిన వారైతే , ఒక్కసారి నా కుమారుని కథ చదివిన తరువాత మీకు అర్థమవుతుంది, ఎలా అతను ఆండ్రూ కార్నెగీ గారి ఫార్ములాను శోధించి , విజయవంతంగా ఎలా తన జీవితాన్ని మార్చుకున్నాడో.  బహుశా జీవన ఎడారిలో మీరు వెదుకుతున్న ఒయాసిస్ అదే కావచ్చు.

ప్రపంచ యుద్ద సమయంలో అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ , ఈ రహస్యాన్ని విరివిగా వాడారు. అప్పటి యుద్దంలో పోరాడుతున్న ప్రతి సైనికునికి, యుద్దానికి సిద్దం చేసే శిక్షణా తరగతుల్లో ఒక పద్దతిగా ఈ ఫార్ములాను చేర్చి బోధించారు. అదే సమయంలో యుద్దాన్ని నడిపించడానికి జరిగిన నిధుల సమీకరణ కార్యక్రమానికి ఈ రహస్యాన్ని వాడినట్లు, ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ పలుమార్లు నాతొ వెల్లండించారు.

ఇరవై సంవత్సరాల క్రితం, తన ప్రజల స్వాతంత్రం కోసం , అప్పటి ఫిలిప్పీన్ దీవుల వైస్రాయ్ ప్రతినిధి శ్రీ మనుఎల్ ఎల్. క్వేజోన్ ఈ రహస్యం తెలుసుకొని ప్రభావితులయ్యారు. అతను ఫిలిప్పీన్స్ కు స్వాతంత్రం తేవడమే కాకుండా, ఆ బంధ విముక్త దేశానికి ప్రప్రథమ అధ్యక్షులయ్యారు. ఈ రహస్యం యొక్క గొప్ప విషయం ఏమిటంటే ఒక్కసారి ఎవరైతే దీనిని పొంది , దీని ద్వారా విజయాన్ని అలవోకగా సాధిస్తారో , వారు ఇంక తమ జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు లేదా ఓడిపోయే పరిస్థితులను దరిచేరనీయరు. ఒకవేళ మీకు నేను చెప్పిన ఈ విషయం నమ్మలేకుండా ఉన్నట్లుగా ఉంటే , ఈ రహస్యాన్ని ఉపయోగించి జీవితంలో, వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తుల పేర్లను నేను ప్రస్తావించిన ప్రతి చోట చూడండి. ఆ వ్యక్తుల గురుంచి కొంత పరిశోధన చేయండి. మీరు అప్పుడు ఒప్పుకుంటారు నేను చెప్పిన విషయం లో ఎంత బలం ఉందో.

ఈ ప్రపంచం లో ఏది కూడా మనకు ఉచితంగా లభించదు !

నేను మీకు చెబుతున్న ఈ రహస్యం తగిన మూల్యం చెల్లించ కుండా లభించదు. కాని చెల్లించే మూల్యం కన్నా జరిగే లాభం ఎన్నో రెట్లు ఎక్కువ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నిజంగా అవసరంతో కావాలని వెతికే వారికి తప్ప ఈ రహస్యం ఎంత మూల్యం ఐన చెల్లిస్తాము అనేవారికి  కనబడదు. ఇది ఉచితంగా ఇచ్చేది కాదు మరియు డబ్బుతో కొనే వస్తువూ కాదు. ఎందుకంటే  ఇది రెండు భాగాలుగా లభిస్తుంది. అందులో ఒక భాగం ఈ రహస్యాన్ని పొందాలి అనుకునేవారి దగ్గర ఉంటుంది. అంతే కాకుండా ఈ రహస్యం పొందడానికి సిద్దంగా ఉన్నవారందరికీ ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా పనిచేస్తుంది.

ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి కాని , దానిని ఉపయోగించడానికి కాని విద్యతో సంబంధం లేదు. నేను పుట్టేకంటే చాలా సంవత్సరాల క్రితమే, థామస్ ఎ. ఎడిసన్ దగ్గరికి ఈ రహస్యం చేరుకొంది. కేవలం మూదు నెలల విద్యాభ్యాసం కలిగిన ఇతను,  ఈ రహస్యాన్ని ఎంతో తెలివిగా వాడుకొని ప్రపంచంలోనే ఒక గొప్ప సృష్టికర్తగా ఎదిగాడు. ఇదే రహస్యాన్ని ఎడిసన్ గారి వ్యాపార సహాయకునికి కూడా అందజేయడం జరిగింది. అతను దీనిని ఎంతో ప్రభావవంతంగా వాడుకొని, అప్పటివరకు $12000 మాత్రమే సంపాదించే వ్యక్తి ఎంతో ఐశ్వర్యాన్ని కూడగట్టుకొని , ఎంతో పిన్న వయసులోనే తన వ్యాపార లావాదేవీల నుండి విరమణ పొందాడు. అతని కథను ఈ పుస్తకం మొదటి అధ్యాయంలో పొందు పరచడం జరిగింది. ఆ కథ చదివిన తరువాత ధనాన్ని సంపాదించడం అనే విషయం అంత కష్టం కాదనే విషయాన్ని తప్పకుండా విశ్వసిస్తారు. అంతే కాకుండా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఎంత డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో, ఎలాంటి పేరు, ప్రఖ్యాతులు పొందాలని అనుకుంటున్నారో , ఎంత ఆనందాన్ని కావాలని అనుకుంటున్నారో , అన్నీ మీరు అనుకుంటున్నట్లుగా ఈ రహస్యాన్ని నమ్మి, ఆ ఆశిస్సులు పొందుతారని చాల నమ్ముతున్నాను.

ఐతే మీరు అడుగొచ్చు, ఇవన్నీ నాకు ఎలా తెలుసనీ ! మీరు ఈ పుస్తకం పూర్తిగా చదివేసరికి మీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది. అయితే అది మీకు మొదటి అధ్యాయంలో దొరకొచ్చు ,లేదా ఆఖరి అధ్యాయం లోనైనా దొరకొచ్చు.

కార్నేగి గారి అభ్యర్థనతో ఇరవై సంవత్సరాలుగా నేను జరుపుతున్న ఈ బృహత్తర పరిశోధనలో భాగంగా, నేను వందలాది ప్రముఖ వ్యక్తులను పరిశీలించే అవకాశం కలిగింది. అందులో చాలా మంది తాము కూడగట్టిన గొప్ప సంపద అంతా కార్నెగీ గారి రహస్యం పుణ్యమేనని ఒప్పుకున్నారు.

ఆ వ్యక్తుల జాబితా ఇక్కడ పొందుపరచడం జరిగింది:

 

 

 

 

Leave a Reply

Required fields are marked *.