UseTelugu.com – తెలుగు వాడండి

కమ్మని కాఫీ లాంటి తెలుగు .. మనసార ఆస్వాదించండి

చతుర్వేదములు (Four Vedas)

March 24, 2015 by admin | 0 comments

Image result for laxmi brahmarishis

పూర్వము ఋషులు యజ్ఞ యాగాదులు నిర్వహించినపుడు ఈ వేదములందలి మంత్రములను వినియోగించి నారు.  వేదములు దైవ వాక్కులు , పరమేశ్వర విశ్వాసములు.  వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము.

ఋగ్వేదం

పాదబద్దములగు మంత్రమును “ఋక్కు” అని అందురు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుట వలన దీనికి “ఋగ్వేదము” అని పేరు. ఈ వేదమునకు 21 శాఖలు కలవు. ఆ 21 శాఖలలో శాకలశాఖ, బాష్కల శాఖ అనే రెండు శాఖలు మాత్రం ప్రస్తుతం లభించుచున్నవి. ఇందు వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు తయారు చేయు విధానం, టెలిగ్రామ్, వైర్ లెస్ వంటి అనేక ఆధునిక శాస్త్రములు ఈ ఋగ్వేదమునందు గలవు. యజ్ఞ సమయమునందు హవిర్భావముల గ్రహించు నిమిత్తం హోతయను ఋత్విక్కు ఈ వేదమంత్రములతో దేవతలను ఆహ్వానించును. అందుచే ఈ వేదమునకు “హౌత్రవేదము” అని పేరు. ఈ ఋగ్వేదమును 10 మండలములుగా విభజించిరి. ఒక శాఖవారు 8 అష్టకములుగా విభజించారు.

యజుర్వేదము

ఇందు కృష్ణ యజుర్వేదము , శుక్ల యజుర్వేదము అనియు రెండు విధములు కలవు. ‘తైత్తిరి’ అను పేరు గల ఆచార్యుడు శిష్య ప్రశిష్యులకు బోధించెను. అందుచే ‘తైత్తరీయమని’ పేరు వచ్చింది. ఈ తైత్తరీయ వేదమునకు సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము అను మూడు భాగాములు ఉన్నవి. ఈ సంహితయందు 7 అష్టకములు (కాండములు), 44 ప్రశ్నలు (ప్రపాఠకములు), 651 అనువాకములు, 2196 పంచాశత్తులు (ప్రసనలు) ఉన్నవి.

ఇందులో కర్మలను తెలుపు  శాస్త్రము, బ్రహ్మ విద్య, సృష్టి విద్య, గణిత విద్య, శారీరక శాస్త్ర విద్య, అంతరిక్ష విద్య మొదలగునవి కలవు.

శుక్లయజుర్వేదము 

వాజసనేయ సంహిత అని దీనికి మరొక పేరు. ప్రస్తుతం ఈ వేదమునందు మాధ్యందిన శాఖ, కాణ్వ శాఖ అని రెండు శాఖలు కలవు. ఈ రెండు శాఖల వారిని తెలుగునాట “ప్రథమ శాఖ” అంటారు. శుక్లాయజుర్వేదము లో 40 అధ్యాయములు కలవు. ఈ వేదమునకు “శతపథ బ్రాహ్మణము” అని పేరు.  ఈ వేదమంత్రములతో “అధ్వర్యుడు” అను ఋత్విక్కు యజ్ఞమునందు హోమాది ప్రధాన క్రుత్యములను ఆచరించును. సకల కర్మలు ఆపస్తంబ మహర్షి చేసిన కల్ప సూత్రమును అనుసరించి జరిపించుకుంటారు .

సామవేదము

ఇది ఈశ్వర భక్తి ప్రభోదించు శాస్త్రము. సామము అనగా గానము. గానం చేయదగిన మంత్రములు గల వేదము కావున ‘సామవేదము’ అని పేరు వచ్చినది. ఈ వేదమునకు 1000 శాఖలు కలవని సంప్రదాయం. అయితే ఇప్పుడు ఒకే ఒక్క శాఖ మాత్రమె లభించుచున్నది. యజ్ఞ కాలమునందు ‘ఉద్గాత’ అను ఋత్విక్కు ఈ వేదమంత్రములతో గానము చేయుచూ దేవతలను స్తుతించును. అందుచేతనే ఈ వేదమునకు ‘ఉద్గాతృవేదము’ అని మరొక పేరు ఉంది. ఈ వేదమునకు తాన్ద్యబ్రాహ్మణము మున్నగు బ్రాహ్మణ గ్రంధములు ఎనిమిది కలవు.

అధర్వవేదము (1, 2)

భౌతిక విజ్ఞానము తెలుగు శాస్త్రము ఇది. ఇందు కూడ బ్రహ్మవిద్య, సృష్టి విద్య, ఉపాసనాది విధి భగవత్ప్రార్ఠన, బ్రహ్మచర్య విధి, పంచయజ్ఞ విధి వంటి విషయములు గలవు. ఈ వేదమును 20 కాండములుగా విభజించిరి. ఒకప్పుడు ఈ వేదమునకు తొమ్మిది శాఖలు ఉండేవి. ఇప్పుడు ఒక శాఖ మాత్రమే లభించుచున్నది. ఋత్విక్కు (బ్రహ్మ) అవశ్యము తెలుసుకొనవలసిన విధి ఈ వేదమునందు కలదు. అందుచేత దీనిని బ్రహ్మవేదము అని కూడా అందురు. ఇతర వేదములకంటే శాంతికి, పౌష్టిక కర్మలు ఈ వేదమునందు అధికముగా ఉన్నవి. దీనికి ‘గోపథ బ్రాహ్మణము’ అని మరొక పేరు గూడ కలదు.

వేదమునందు సంహిత అనియు, బ్రాహ్మణము అనియు ప్రధాన భాగములు కలవు. సంహిత అనగా మంత్రములు మాత్రము గల భాగము. బ్రాహ్మణము అనగా అర్థగాంభీర్యము గల మంత్రముల అర్థములను వివరించునట్టి గాని, మంత్రములను వల్లించుచూ  చేయవలసిన పనిని గాని తెలియజేయునట్టి గ్రంధము.

ప్రస్తుతము వ్యవహారములో ఉన్న విశేషములు:

1)ఋగ్వేదమునకు ఆశ్వలాయన సాంఖ్యాయన సూత్రములను

2) కృష్ణ యజుర్వేదమునకు ఆపస్తంబ, అనగా అర్థగాంభీర్యం గల మంత్రముల అర్థములను వివరించునట్టి గాని, మంత్రములను వల్లించుచూ చేయవలసిన పనిని గాని తెలియజేయునట్టి గ్రంథము.

ప్రస్తుతము వ్యవహారములో ఉన్న విశేషములు
1. ఋగ్వేదమునకు ఆశ్వలాయన సాంఖ్యాయన సూత్రములను;
2. కృష్ణ యజుర్వేదమునకు అపస్తంబ, బోధాయన, సత్యాశాడ, హిరణ్య కేశీయ, మానవ, వైఖానస సోత్రములును; శుక్ల యజుర్వేదమునకు పారస్కర, కాత్యాయన సోత్రములు.
3. సామవేదమునకు గోబిల ద్రాహ్యాయణాది సూత్రములు;
4. అధర్వవేదమునకు కౌశిక సూత్రములును వ్యవహారమున కలవు.

Vedas

ఉపవేదములు

1. ఆయుర్వేదము (వైద్యశాస్త్రము)
2. ధనుర్వేదము (శస్త్రాస్త్ర విద్య మరియు రాజ ధర్మశాస్త్రం ) (*)
3. గాంధర్వ వేదము (గాన శాస్త్రము)
4. అర్థవేదము (కళలు, రాజకీయ, ఆర్ధిక, వ్యవసాయ, గోరక్ష వ్యాపార విషయముల శాస్త్రము)

వేదాంగములు

1. శిక్ష: వేదములందలి అక్షరములను, స్వరములను ఉచ్చరించు రీతిని వివరించి చెప్పును. దీనిని పాణిని రచించెను.
2. వ్యాకరణము: సుశబ్ద, అపశబ్దములను బొధించును. దీనిని గూడ పాణినియే రచించెను. ఇది ఆధునిక భాషా శాస్త్రములకు మూలము. ఇందు 8 అధ్యాయములు కలవు.
3. ఛందస్సు: పింగళుడు, ఛందోవిచితి అనబడు 8 అధ్యాయముల ఛందో శాస్త్రము రచించెను. మంత్రములందుగల వృత్తి విశేషములు బోధించెను.
4. నిరుక్తము: వేదమంత్రములందుగల కఠినపదముల భావమును బోధించును. దీనిని యాస్కుడు రచించెను.
5. జ్యోతిషము: ఇది కాలనియమమును బోధించు శాస్త్రము. లగధుడు, గర్గుడు మొదలగువారు రచించిరి.
6. కల్పము : ఇది ఆయా మంత్రములు పఠించుచూ చేయవలసిన కారయములను బోధించును. అశ్యాలాయనుడు, సాంఖ్యాయనుడు మున్నగువారీ శాస్త్రమును రచించిరి.

ఉపాంగములు

భగవంతుని ధర్మములను తెల్పు శాస్త్రములు 6. వీటిని షడ్దర్మవములందురు.

1. సాంఖ్యశాస్త్రము
2. యోగశాస్త్రము
3. న్యాయవైశేషిక శాస్త్రము
4. పూర్వ మీమాంస శాస్త్రం
5. ఉత్తర మీమాంస శాస్త్రం

స్మృతులు

1. మనుస్మృతి
2. పరాశరస్మృతి
3. వశిష్టస్మృతి
4. శంఖస్మృతి
5. అత్రిస్మృతి
6. విశ్నుస్మృతి
7. హారితస్మృతి
8. యమస్మృతి
9. అంగీరసస్మృతి
10. ఉశనస్మృతి
11. సంవర్తనస్మృతి
12. బృహస్పతిస్మృతి
13. లిఖితస్మృతి
14. కాత్యాయనస్మృతి
15. దక్షస్మృతి
16. వ్యాసస్మృతి
17. యాజ్ఞవల్కస్మృతి
18. శాతతపస్మృతి
వీటన్నిటియందు మనుస్మృతి ముఖ్యమైనది.

ఉపనిషత్తులు 

వేదముల చివరిభాగాములు ఉపనిషత్తులు. ఉపనిషత్తు అనగా బ్రహ్మజ్ఞానము కలుగజేయునది. ఈ ఉపనిషత్తులు మొత్తము 108. వీనిలో ముఖ్యమైన ఉపనిషత్తులు 10.

1. ఈశ
2. కేన
3. కఠ
4. ప్రశ్న
5. మండక
6. మాండూక
7. తిత్తరి
8. ఐతరేయ
9. చాందోగ్య
10. బృహదారణ్యక

ఆగమములు

శైవాగాగములు 28: వైష్ణవాగామములు 2. దేవాలయ నిర్మాణము, విగ్రహమూల తయారీ, ఆలయ ప్రతిష్ట పూజా విధానం మొదలగునవి ఆగమములలో వివరించబడినవి.

వర్ణాశ్రమములు 

వర్ణములు 4: బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు
ఆశ్రమములు 4: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమము