UseTelugu.com – తెలుగు వాడండి

కమ్మని కాఫీ లాంటి తెలుగు .. మనసార ఆస్వాదించండి

“తెలుగు వాడండి” (http://www.usetelugu.com) వెబ్ సైట్ కు క్రొత్త హంగులు !!!

September 30, 2012 by admin | 0 comments

ఈ వెబ్ సైట్ చరిత్ర లో మరొక క్రొత్త అధ్యాయం మొదలైంది. ఈ రోజే ఒక క్రొత్త హోస్టింగ్ ప్లాన్ ఫై మన తెలుగు వాడండి సైట్ ను రూపొందించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఎన్నో క్రొత్త విషయాలు పొందు పరచడానికి కావలసినంత బలాన్ని ఇవ్వడం పూర్తయింది. ఈ ప్రయాణం లో ఎలాంటి ఆటంకాలు ఇక రాకుండా ఉండాలని ఆ భగవంతున్ని మనసారా కోరుకుంటూ ఒక శ్లోకంతో ఈ సైట్ ను పునరుద్దీపించడం జరుగుతోంది.


వినాయక స్త్రోత్రం 
|| తుండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్ 
   మెండుగా మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ 
     కొండొక గుజ్జురూపమున కూరిన విద్యలెల్ల  నొజ్జయై 
     యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ||

తెలుగులో బ్లాగు వ్రాయడం సులువా ?

September 30, 2012 by admin | 0 comments

” మడిసన్న తర్వాత కాస్తంత కళాపోసన ఉండాల ” అని ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాల రావు అన్నడైలాగులు గుర్తుకు వచినప్పుడల్లా , తెలుగులో బ్లాగులు వ్రాయడం పెద్ద విషయం కాదేమో అనిపిస్తోంది. ఐనా ఎవరిని ఉద్దరించడానికి ఈ బ్లాగు రాస్తున్నావయ్యా అని కొందరు అడగవచ్చు. ఆ విషయానికి వస్తే ఉద్దరించడానికి బ్లాగులు రాసేంత గొప్ప రచయితనైతే కాదు.
ఇంటర్నెట్లో తెలుగులో వ్రాయగలుతున్నాము ఈ రోజు అంటే ఎంతో మంది తెలుగు ఔత్సాహిక సాంకేతిక నిపుణుల పుణ్యం అని చెప్పక తప్పదు.
మరి నీ ఈ బ్లాగులో ఏం రాస్తావు అని ఎవరైనా అడగొచ్చు. నిన్న నా ఫ్రెండ్ ఒకడైతే ” మామా, ఏదైనా గాస్సిప్ ఉండాలిరా జనం చదవాలంటే” అన్నాడు. వాడి మాటలోనూ నిజం లేకపోలేదు. ప్రస్తుతమున్న తెలుగు వెబ్ సైట్లు మొదట తెలుగు వారికి ఏదో రకంగా సేవలనందించి , తద్వారా డబ్బు సంపాదించాలని వచ్చినవే. కాని కాలక్రమేణా ఈ పోటీ ప్రపంచంలో నిలదోక్కుకోవాలనే తపనతో ఏదో రకమైన కొత్తదనం కోసం కొత్తపుంతలు తొక్కడం సహజమే కదా !
ఇక విషయానికి వస్తే ఇది రాయాలి, అది రాయాలి అని ఏమి మనసులో స్థిరంగా  పెట్టుకోదల్చుకోలేదు. ఏది తోస్తే అది, మనసుకు నచ్చింది , మనుషులకు నచ్చేది ఇక్కడ పొందుపరచాలి. అంతే చాల సింపుల్ ! కదా !
— రమేష్ దడిగల