UseTelugu.com – తెలుగు వాడండి

కమ్మని కాఫీ లాంటి తెలుగు .. మనసార ఆస్వాదించండి

తెలుగులో బ్లాగు వ్రాయడం సులువా ?

| 0 comments

” మడిసన్న తర్వాత కాస్తంత కళాపోసన ఉండాల ” అని ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాల రావు అన్నడైలాగులు గుర్తుకు వచినప్పుడల్లా , తెలుగులో బ్లాగులు వ్రాయడం పెద్ద విషయం కాదేమో అనిపిస్తోంది. ఐనా ఎవరిని ఉద్దరించడానికి ఈ బ్లాగు రాస్తున్నావయ్యా అని కొందరు అడగవచ్చు. ఆ విషయానికి వస్తే ఉద్దరించడానికి బ్లాగులు రాసేంత గొప్ప రచయితనైతే కాదు.
ఇంటర్నెట్లో తెలుగులో వ్రాయగలుతున్నాము ఈ రోజు అంటే ఎంతో మంది తెలుగు ఔత్సాహిక సాంకేతిక నిపుణుల పుణ్యం అని చెప్పక తప్పదు.
మరి నీ ఈ బ్లాగులో ఏం రాస్తావు అని ఎవరైనా అడగొచ్చు. నిన్న నా ఫ్రెండ్ ఒకడైతే ” మామా, ఏదైనా గాస్సిప్ ఉండాలిరా జనం చదవాలంటే” అన్నాడు. వాడి మాటలోనూ నిజం లేకపోలేదు. ప్రస్తుతమున్న తెలుగు వెబ్ సైట్లు మొదట తెలుగు వారికి ఏదో రకంగా సేవలనందించి , తద్వారా డబ్బు సంపాదించాలని వచ్చినవే. కాని కాలక్రమేణా ఈ పోటీ ప్రపంచంలో నిలదోక్కుకోవాలనే తపనతో ఏదో రకమైన కొత్తదనం కోసం కొత్తపుంతలు తొక్కడం సహజమే కదా !
ఇక విషయానికి వస్తే ఇది రాయాలి, అది రాయాలి అని ఏమి మనసులో స్థిరంగా  పెట్టుకోదల్చుకోలేదు. ఏది తోస్తే అది, మనసుకు నచ్చింది , మనుషులకు నచ్చేది ఇక్కడ పొందుపరచాలి. అంతే చాల సింపుల్ ! కదా !
— రమేష్ దడిగల

Leave a Reply

Required fields are marked *.